IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రెండొందలు కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ ముందు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సొంత గ్రౌండ్లో రెచ్చిపోయిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(57) హాఫ్ సెంచరీ బాదాడు. డెవాన్ కాన్వే(47), శివం దూబే (27), మోయిన్ అలీ (19) రాణించారు. చివర్లో అంబటి రాయుడు(27) ధాటిగా ఆడి స్కోర్ రెండొందలు దాటించాడు. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్లో ఎంఎస్ ధోనీ(12) వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ తలా మూడు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై దంచి కొట్టిన రుతురాజ్ గైక్వాడ్(57) రెండో హాఫ్ సెంచరీ బాదాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన 5వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదాడు. కృనాల్ పాండ్యా వేసిన 8వ ఓవర్లో సింగిల్ తీసి ఫీఫ్టీకి చేరువయ్యాడు. 25 బంతుల్లోనే రెండు ఫోర్లు, 4 సిక్స్‌లతో ఈ ఓపెనర్ యాభై రన్స్ కొట్టాడు. డెవాన్ కాన్వే(47)తో కలిసి తొలి వికెట్‌కు 110 రన్స్ జోడించాడు.
Innings Break!@ChennaiIPL post a commanding total of 217/7 on board!
Can @LucknowIPL chase this down to bag their second win of the season❓
Stay tuned for the second innings!
Scorecard ▶️ https://t.co/buNrPs0BHn#TATAIPL | #CSKvLSG pic.twitter.com/sM1foAuWW4
— IndianPremierLeague (@IPL) April 3, 2023
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 5 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది అతను ఈ రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటి వరకు ఐదుగురు 5వేల పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఐపీఎల్లో ఈ ఫీట్ సాధించారు.