శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Sep 22, 2020 , 03:02:19

రుతురాజ్‌ వచ్చేశాడు..

రుతురాజ్‌ వచ్చేశాడు..

 దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు ఊరట కల్గించే వార్త. కరోనా వైరస్‌ బారిన పడిన యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. తాజాగా జరిపిన రెండు పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడంతో సోమవారం జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌కు రుతురాజ్‌ హాజరయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే తమ ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది.