IPL 2025 : ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ సీజన్లో చెలరేగి ఆడుతున్న శుభ్‌మన్ గిల్(35)ను అవేశ్ ఖాన్ వెనక్కి పంపగా.. కాసేపటికే దంచి కొడుతున్న జోస్ బట్లర్(33)ను ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేసి గుజరాత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. దాంతో, 96కే 3 వికెట్లు పడ్డాయి. అయితే.. కుర్రాళ్లు షారుక్ ఖాన్(34 నాటౌట్), రూథర్‌ఫొర్డ్ (37 నాటౌట్)లు గెలింపించే బాధ్యత తీసుకున్నారు.
లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ బౌండరీలతో హోరెత్తిస్తున్నారు. షహబాజ్ వేసిన 15వ ఓవర్లో 4,6 కొట్టిన రూథర్ఫొర్డో స్కోర్ 160 దాటించాడు. 15 ఓవర్లకు గుజరాత్ 3వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. ఇంకా విజయానికి 30 బంతుల్లో71 పరుగులు కావాలి.
Jos Buttler & Shubman Gill looking in solid touch 👌#LSG taste early success with Sai Sudharsan’s wicket ☝#GT 76/1 after 7 overs.
Updates ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/LsJioJZMDV
— IndianPremierLeague (@IPL) May 22, 2025
లక్నో నిర్దేశించిన భారీ ఛేదనను ధాటిగా ఆరంభించిన గుజరాత్‌కు షాక్. డేంజరస్ ఓపెనర్ సాయి సుదర్శన్(21) ఔటయ్యాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. చివరకు విలియం ఓ రూర్కీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సాయి మిడాన్ దిశగా ఆడిన బంతిని అక్కడే కొచుకొని ఉన్న హిమ్మత్ సింగ్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 46 వద్ద వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(35)కు జత కలిసిన జోస్ బట్లర్(33) వస్తూ వస్తూనే విధ్వంసక ఆటకు తెరతీశాడు.
Akash Singh signs Digvesh’s proxy 🖋📓
🎥 A clever slower one from the #LSG pacer to outfox Jos Buttler 🤌
Updates ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG | @LucknowIPL pic.twitter.com/SC2yUvw3bH
— IndianPremierLeague (@IPL) May 22, 2025
అవేశ్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాది 21 రన్స్ రాబట్టాడు. దాంతో, గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అయితే.. గిల్‌ను ఔట్ చేసి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు అవేశ్ ఖాన్. రూథర్‌ఫొర్డ్()తో కలిసి గుజరాత్‌ను గెలిపించాలనుకున్న బట్లర్‌ను ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేయడంతో లక్నో ఊపిరి పీల్చుకుంది. ఈ సీజన్లో గుజరాత్ టాపార్డర్ 10 ఓవర్లలోపే పెవిలియన్ చేరడం ఇదే మొదటిసారి.