ముంబై రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. 61 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కోల్‌కతా చివరి ఓవర్లలోనూ నిదానంగా ఆడుతోంది. క్రిస్‌మోరీస్ వేసిన 11వ ఓవర్లో మోర్గాన్ డకౌట్ అయ్యాడు. సునీల్ నరైన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్.. కనీసం బంతిని కూడా ఎదుర్కోకుండానే వెనుదిరిగడంతో భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న రాహుల్ త్రిపాఠి(36) 16వ ఓవర్లో ఔటవడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 5 వికెట్లకు 98 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(19), రస్సెల్(0) క్రీజులో ఉన్నారు.
The fall of wickets continue and this time #KKR lose their top-scorer Rahul Tripathi for 36(26). Mustafizur has his first wicket.
— IndianPremierLeague (@IPL) April 24, 2021
Dre Russ now joins DK in the middle. KKR are 98-5 after 16 overs. #VIVOIPL #RRvKKR
👉 https://t.co/oKLdD2Pi9R pic.twitter.com/3PVr2BZVPD