Akash Deep : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే కొత్త కారు కొని తన కలను నిజం చేసుకున్న అతడికి ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (RTA) పెద్ద షాకిచ్చింది. రాఖీ రోజున తన అక్కా చెల్లెల్లతో కలిసి నలుపు రంగు టయోటా ఫార్చునర్ కొనుగోలు చేసిన స్పీడ్‌స్టర్.. నంబర్ ప్లేట్ లేకుండా కారు నడపడమే అందుకు కారణం.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ (HSRP) లేకుండా కారు తీసినందుకు భారత పేస్ గన్‌కు నోటీసులు జారీ చేశారు ఆర్టీఏ అధికారులు. అంతేకాదు ఆకాశ్‌కు కారు అమ్మిన సన్నీ మోటార్స్, డీలర్‌కు కూడా నోటీసులు పంపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండానే భారత పేసర్‌కు కారు అమ్మినందుకు ఆ షోరూమ్ డీలర్‌షిప్‌ను నెలరోజులు సస్పెండ్ చేసింది ఆర్టీఏ. షోరూమ్ నిర్వాహకులు ఇలా ఎందుకు చేశారో వివరణ ఇచ్చేందుకు 14 రోజుల గడువు విధించింది.
India fast bowler Akash Deep has found himself in the headlines for reasons away from cricket, with the Uttar Pradesh Transport Department issuing him a notice for allegedly using a vehicle without a High Security Registration Plate (HSRP).
Action has also been taken against M/s… pic.twitter.com/1YnGX6rqU5
— IndiaToday (@IndiaToday) August 11, 2025
ఎప్పటినుంచో తన డ్రీమ్ కారు కొనాలనుకుంటున్న ఆకాశ్ దీప్ ఎట్టకేలకు రాఖీ పండుగ రోజున ఖరీదు చేశాడు. అమ్మ, అక్క, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి షోరూం వెళ్లి తనకెంతో ఇష్టమైన టయోటా ఫార్చునర్ (Tayota Fortuner) కారు కొన్నాడీ పేసర్. తన డ్రీమ్ కారు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడీ స్పీడ్‌స్టర్. ‘నా కల సాకారమైంది. కీ అందుకున్నాను. నాకు ఎంతో విలువైన వ్యక్తుల సమక్షంలో కారు కొనడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు.
Had to leave Bihar due to BCA ban.
Took 3 year break at 23 after father’s paralytic attack.
Lost father & elder brother within 2 months.
Survived a career-threatening back injury.
But Akash Deep never gave up. True Hero. pic.twitter.com/bDOxnaYFu4
— Sports Culture (@SportsCulture24) July 6, 2025
ఇంగ్లండ్‌లో సిరీస్ సమం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆకాశ్.. స్వదేశం వచ్చాక తన కలల కారును సొంతం చేసుకున్నాడు. నలుపు రంగు టయోటా ఫార్చునర్‌ను ఇంటికి తీసుకెళ్లాడీ పేసర్. దీని ఖరీదు రూ.62 లక్షలు ఉంటుందని అంచనా. ఆకాశ్ కొత్త కారు పోస్ట్ క్షణాల్లో వైరలైంది. దీనిపై భారత టీ20 సారథి సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘చాలా చాలా సంతోషం’ అంటూ కామెంట్ పెట్టాడు.
బర్మింగ్ హమ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు ఆకాశ్. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్లు బ్రూక్, రూట్లను బౌల్డ్ చేసి.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. తనకు బహుమతిగా లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే.
Outstanding 100 by Yashasvi on a sporting pitch that tested courage and concentration. Full marks to Akashdeep too, batting with heart and determination under pressure. Keep fighting, India. pic.twitter.com/5ym8JOBKGn
— Sachin Tendulkar (@sachin_rt) August 2, 2025
ఐదు టెస్టుల సిరీస్ సమం చేయడంలో కీలకమైన ఓవల్ టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు ఆకాశ్. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 107 రన్స్ జోడించాడు. అమూల్యమైన పరుగులతో జట్టు భారీ స్కోర్‌కు కారణమైన అతడు.. బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. మొత్తంగా మూడు టెస్టులు ఆడిన ఈ స్పీడ్ గన్ 13 వికెట్లతో రాణించాడు.