విశాఖపట్నం: స్టార్ రెజ్లర్ సంగీతా ఫోగట్, సరితా మోర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్షిప్ టైటిళ్లు నిలబెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల 62 కేజీల ఫైనల్లో సుమిత్రను చిత్తు చేసిన సంగీత చాంపియన్గా నిలువగా.. 59 కేజీల ఈవెంట్ తుదిపోరులో సిమ్రన్పై సరిత అద్వితీయ విజయం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన స్టార్ రెజ్టర్ బజరంగ్ పునియా భార్య అయిన సంగీత.. అంచనాలకు తగ్గట్లు రాణిస్తూ ఆకట్టుకుంది.