లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (13) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. గత రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన బట్లర్.. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే క్రీజులో తడబడుతూ కనిపించాడు. అతనితో కలిసి ఓపెనింగ్ చేసిన దేవదత్ పడిక్కల్ (25 నాటౌట్) కూడా కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినప్పటికీ నెమ్మదిగా క్రీజులో కుదురుకున్నట్లే కనిపిస్తున్నాడు.
కానీ ఐదో ఓవర్లో ఆవేష్ ఖాన్ వేసిన తొలి బంతికే బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లాంగాన్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్.. బంతిని మిస్ అయ్యాడు. దాంతో ఆవేష్ వేసిన బంతి స్టంప్స్‌ను పడగొట్టింది. బట్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అతను అవుటవడంతో కెప్టెన్ సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.