ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అదే సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ధాటిగా ఆడటంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. జోస్ బట్లర్‌ను చేతన్ సకారియా అవుట్ చేశాడు.