రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ నిలకడగా రాణిస్తోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ భరత్ (0) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మిచెల్ మార్ష్ (42 నాటౌట్) ఆదుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన అతను.. అవకాశం చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరూ సంయమనంతో ఆడుతుండటంతో ఢిల్లీ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.