రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌తో సతమతం అవుతున్న రుతురాజ్ గైక్వాడ్ (2) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి విఫలమైన రుతురాజ్.. కీపర్ శాంసన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
తను ఎదుర్కొన్న తొలి బంతికి రెండు పరుగులు తీసిన అతను.. ఆ తర్వాత నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయాడు. చివరి బంతికి బౌండరీ బాదేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో 2 పరుగులకే చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది.