ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొందింది.
తొలుత యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హారీస్ (46) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో పెర్రీ 3, సోఫియా డివైన్, శోభన చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కనిక (46), రిచా ఘోష్ (31), హీతర్ నైట్ (24) రాణించారు.