హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరం మరో క్రీడోత్సవానికి సిద్ధమైంది. బుధవారం నుంచి హుస్సేన్‌సాగర్‌లో 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ చాంపియన్‌షిప్ పోటీలు మొదలుకానున్నాయి. అండర్-13, అండర్-15 బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో జరుగబోయే ఈ పోటీల్లో 23 రాష్ర్టాల నుంచి సుమారు 350 మంది రోయర్లు పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.పీ. మిథున్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నాలుగేండ్ల తర్వాత ఈ టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నదని.. రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు నగరం వేదిక కానుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.