Lanka Premier League : లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ (Jaffna Kings) రికార్డు సృష్టించింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన జాఫ్నా జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. ఆదివారం గాలే మార్వెల్స్ (Galle Marvels)తో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. భారీ ఛేదనలో జాఫ్నా చిచ్చరపిడుగు రిలే రూసో (106 నాటౌట్) మెరపు సెంచరీతో కదం తొక్కాడు. అతడికి కుశాల్ మెండిస్ (72 నాటౌట్) తోడవ్వడంతో జాఫ్నా కింగ్స్ మరోసారి చాంపియన్ అయింది. ఇప్పటికే మూడు టైటిళ్లు గెలిచిన ఆ జట్టు చరిత అసలంక కెప్టెన్సీలో తొలి ట్రోఫీని ముద్దాడింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం పరుగుల విందు అభిమానులను అలరించింది. జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్ ఆటగాళ్ల బౌండరీల జడివానలో ప్రేక్షకులు తడిసిముద్దయ్యారు. అయితే.. భారీ ఛేదనలో వార్ వన్‌సైడ్ చేస్తూ జాఫ్నా కింగ్స్ టైటిల్‌ను తన్నుకుపోయింది.
Jaffna Kings Reign Supreme!
🏆 Jaffna Kings dominate with a 9-wicket victory to clinch the trophy for the 4th time! Unstoppable champions making history once again! 🏏👑#LPL2024 pic.twitter.com/JDwmSQUxPq
— LPL – Lanka Premier League (@LPLT20) July 21, 2024
తొలుత ఆడిన గాలే మార్వెల్స్ భారీ స్కోర్ కొట్టింది. భానుక రాజపక్సే(82) అర్ధ శతకంతో చెలరేగగా.. టిమ్ సీఫర్ట్ (47) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, నిర్ణీత ఓవర్లలో గాలే జట్టు 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన జాఫ్నా కింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెన్ ప్రథుమ్ నిస్సంక(0) వికెట్ కోల్పోయింది. అయినా జాఫ్నా ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు.

ఓపెనర్ కుశాల్ మెండిస్(72 నాటౌట్) అండగా రిలీ రూసో(106 నాటౌట్, 53 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. గాలె మార్వెల్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. సెంచరీతో గాలే విజయావకాశాల్ని దెబ్బతీశాడు. దాంతో, 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జాఫ్నా కింగ్స్ జట్టుకు ఇది నాలుగో టైటల్ కావడం విశేషం. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన రవుసో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.