Ross Taylor : ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు ఎవరైనా. కానీ, న్యూజిలాండ్ వెటరన్ రాస్ టేలర్ (Ross Taylor) మాత్రం సొంత జట్టును కాదని పసికూనకు ఆడేందుకు సిద్దమవుతున్నాడు. అందుకోసం ఏకంగా వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్నాడీ వెటరన్ ప్లేయర్. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ కివీస్ మాజీ సారథి టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడనున్నాడు. తూర్పు ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్‌లో పసికూన అయిన సమోవా (Samoa) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు టేలర్. శుక్రవారం ఈ దిగ్గజ క్రికెటర్ సమోవా జెర్సీని చూపిస్తూ కెమెరాకు ఫోజిచ్చాడు.
‘వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్నా. నీలిరంగు జెర్సీ ధరించడంతో పాటు సమోవాకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా పునరాగమనం మాత్రమే కాదు నాకెంతో ఇష్టమైన ఆట ఆడేందుకు దక్కిన అవకాశం. మా సంస్కృతి, మా వారసత్వానికి ప్రతీక.. మా కుటుంబ మూలాలున్న దేశం జట్టుకు ఆడడం నిజంగా గొప్ప గౌరవం. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ ఇవ్వాలనుకున్నా. కానీ అనుకోకుండా ఆటగాడిగా అవకాశం రావడాన్ని నమ్మలేకపోతున్నా’ అని టేలర్ వెల్లడించాడు. పొట్టి వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సమోవా అక్టోబర్ 8న ఒమన్‌తో తలపడనుంది. అనంతరం పపువా న్యూ గినియా జట్టును ఢీకొట్టనుంది.
Ross Taylor will be back, in new colours!
Samoa have announced a squad which includes the former New Zealand international for the T20 World Cup Asia-EAP qualifier 🇼🇸 pic.twitter.com/C8kALLqnhQ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 5, 2025
టేలర్‌కు అతడి అమ్మ లొటే కారణంగానే సమోవా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. ఎందుకంటే.. ఆమె సమోవా వంశానికి చెందిన మహిళ. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. మూడేళ్లు పూర్తి చేసుకున్నాడు. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మూడేళ్లకు ఇతర జట్లకు ఆడే వీలుంటుంది. సో.. పసికూనకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేశాడు టేలర్.
ప్రపంచంలోని గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడైన టేలర్ న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలుపొందిన జట్టులో సభ్యుడు. అతడు బ్లాక్ క్యాప్ జెర్సీతో 450 మ్యాచులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 18,199 రన్స్ (టెస్టులు- 7,683, వన్డేలు – 8,607, టీ20లు – 1,909 పరుగులు) సాధించాడీ హిట్టర్.
An exciting second innings awaits Ross Taylor 🤩🇼🇸
More ➡️ https://t.co/UiL6lZqhxI pic.twitter.com/sKOIa7kasA
— ICC (@ICC) September 5, 2025