Cristiano Ronaldo : స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతడి అతడి కుమారుడు క్రిస్టియానో జూనియర్(Cristiano Junior) కూడా సాకర్ ఆటలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న క్రిస్టియానో అల్ నస్రీ క్లబ్ తరఫున తొలి టైటిల్ గెలిచాడు.
అల్ నస్రీ జట్టు అండర్ -13 క్లబ్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, రొనాల్డో పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నాడు. అభిమానులేమో తండ్రీకొడుకులు ఒకే క్లబ్ తరఫున ఇరదీస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తండ్రి మాదిరిగానే క్రిస్టియానో జూనయిర్ కూడా 7వ నంబర్ జెర్సీతో ఆడుతాడు. అండర్-13 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈమధ్యే ఒహద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో అదరగొట్టాడు. దాంతో, అల్ నస్రీ క్లబ్ 4-1తో గెలుపొంది అండర్ -13 టైటిల్ విజేతగా అవతరించింది.
ప్రపంచంలోని మేటి సాకర్ అటగాడైన రొనాల్డోకు ఈమధ్య భారీ షాక్ తగిలింది. మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. అంతేకాదు రూ. 2 లక్షల జరిమానా కూడా చెల్లించనున్నాడు. సౌదీ అరేబియా లీగ్(Saudi Arabia Legue 2023)లో భాగంగా ఫిబ్రవరి 25న అల్ నస్రీ, అల్ షాబాద్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ సమయంలో కొందరు మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేశారు. దాంతో, కోపంతో ఊగిపోయిన రొనాల్డో వాళ్లవైపు తిరిగి తన పురుషాంగం చూపిస్తూ.. ‘మీరు ఏమీ పీకలేర’నే అర్థం వచ్చేలా పోజు పెట్టాడు.
imagine being 39 years-old and acting like this
Ronaldo is truly finished pic.twitter.com/fG1Q3yu262
— JOEY (@NUFCJoey) February 25, 2024
దాంతో, అల్ షాదాబ్ క్లబ్ అతడిపై సౌదీ లీగ్ క్రమశిక్షణ, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. దాంతో, రొనాల్డోపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు 10,000 సౌదీ రియాల్‌లను జరిమానాగా విధించింది. అంతేకాదు అల్ షాబాద్ జట్టుకు 20,000 సౌదీ రియాల్స్ చెల్లించాల్సిందిగా రొనాల్డోను ఆదేశించింది.