నేరేడ్మెట్, ఆక్టోబర్ 3: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అగసర నందిని నేటి యువతకు ఆదర్శమని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అన్నారు. చైనా వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్ హెప్టాథ్లాన్‌లో కాంస్యం నెగ్గిన నందినిని మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఘనంగా సన్మానించారు.
నందిని అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ప్రత్యేక కృషి చేసిన కోచ్ నాగపురి రమేశ్‌తో పాటు గోపీచంద్ తల్లిదండ్రులు పుల్లెల సుబ్బరావమ్మ, సుభాష్ చంద్రబోస్‌లు యువ అథ్లెట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన నందిని.. రాష్ర్టానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతో పాటు.. యువతక మార్గదర్శిగా నిలిచిందని అన్నారు.