పుణె: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్‌కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్‌ను డాక్టరేట్‌తో సత్కరించింది.
బుధవారం జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో హిట్‌మ్యాన్‌కు పట్టాను ప్రదానం చేసింది. ‘క్రికెట్లో అభిమానులందరికీ రోహిత్..హిట్‌మ్యాన్‌లా పరిచయం. కానీ అతని కెరీర్లో డాక్టరేట్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుంది’ అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.