చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ మధ్య ఓవర్లలో దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్ మరింత వేగంగా ఆడాలని చూస్తున్నాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ముంబై తొలి సిక్స్ కొట్టింది. అది కూడా ఫాబియెన్ అలెన్ వేసిన ఫుల్‌టాస్‌ను రోహిత్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. 14 ఓవర్లకు ముంబై 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్(53), సూర్య కుమార్ యాదవ్(25) క్రీజులో ఉన్నారు.
FIFTY!👏🏾
— IndianPremierLeague (@IPL) April 23, 2021
First 5️⃣0️⃣ of the season for Hitman @ImRo45 and he gets it 40 in balls with 4×4, 2×6.https://t.co/NMS54FiJ5o #VIVOIPL #PBKSvMI pic.twitter.com/nGUOMRo82a