వాంఖడే: ఆర్సీబీతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌పై వరల్డ్‌కప్ కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రోహిత్ చేసిన కామెంట్ స్టంప్ మైక్‌కు చిక్కింది. దినేశ్ కార్తీక్ నిన్నటి మ్యాచ్‌లో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతను కేవలం 23 బంతుల్లో 53 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
దూకుడుమీదున్న దినేశ్‌ను అడ్డుకునేందుకు రోహిత్ తనదైన స్టయిల్లో కామెంట్ చేశాడు. వరల్డ్‌కప్ సెలక్షన్ కోసం ఆడుతున్నాడని, శభాష్.. మెదడులో వరల్డ్‌కప్ ఆలోచనలు రగులుతున్నాయని, శభాష్ డీకే .. నువ్వు వరల్డ్‌కప్ ఆడాలంటూ అంటూ దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శర్మ ప్రోత్సహించాడు. వరల్డ్‌కప్ కే సెలక్షన్ కే లియే పుష్ కర్నా హై ఇస్కో, శభాష్. దిమాగ్ మే చెల్ రహా హై ఇస్కీ వరల్డ్‌కప్. శభాష్ డీకే. వరల్డ్‌కప్ కేల్నాహై అని హిందీలో దినేశ్ కార్తీక్‌ను రోహిత్ ప్రశంసించాడు.
ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టులో స్థానం కోసం కార్తీక్ ఎదురుచూస్తున్నాడు. జాతీయ సెలెక్టర్లను అతను ఇంప్రెస్ చేస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేసిన చివరి ఓవర్లో 19 రన్స్ రాబట్టాడు. బుమ్రా బౌలింగ్‌లోనూ ఓ సిక్సర్ కొట్టాడతను. కానీ చివరకు మ్యాచ్‌ను ముంబై గెలుచుకున్నది. 197 పరుగులు టార్గెట్‌ను కేవలం 15.3 ఓవర్లలోనే ముంబై ఛేజ్ చేసింది.