సెయింట్ లూసియా: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఒకే ఒక్క మ్యాచ్‌లో మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ 2 మ్యాచ్‌లో అతను ఆ రికార్డులను నమోదు చేశాడు. సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్‌లో.. మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్ లాంటి ఆసీస్ పేస్ బౌలర్లు చితక్కొట్టాడు. 41 బంతుల్లో 92 రన్స్ చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్ట్రయిక్ రేట్ 224.39గా ఉంది.
Rohit Sharma enters the top 10 🇮🇳
📲 https://t.co/lmvdzXCj6n#T20WorldCup pic.twitter.com/ENp4gbhIqG
— ICC (@ICC) June 24, 2024
రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో రెండు కొత్త ప్రపచం రికార్డులను సెట్ చేశాడు. టీ20 క్రికెట్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓ ప్రత్యర్థి దేశంపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా కూడా నిలిచాడతను. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటి వరకు టీ20ల్లో 4165 రన్స్ స్కోర్ చేశాడు. బాబర్ ఆజమ్ 4145, విరాట్ కోహ్లీ 4103 రన్స్ చేశారు.
ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో..
132 రోహిత్ శర్మ వర్సెస్ ఆస్ట్రేలియా
130 క్రిస్ గేల్ వర్సెస్ ఇంగ్లండ్
88 రోహిత్ శర్మ వర్సెస్ విండీస్
87 క్రిస్ గేల్ వర్సెస్ కివీస్
86 అఫ్రిది వర్సెస్ శ్రీలంక
టీ20ల్లో ఫాస్టెస్ట్ 50
12 యువరాజ్ సింగ్ వర్సెస్ ఇంగ్లండ్ 2007
18 బంతుల్లో కేఎల్ రాహుల్ వర్సెస్ స్కాట్లాండ్ 2021
18 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ సౌతాఫ్రికా 2022
19 గౌతం గంభీర్ వర్సెస్ నాగపూర్ 2009
19 రోహిత్ శర్మ వర్సెస్ ఆస్ట్రేలియా 2024
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
101 సురేశ్ రైనా వర్సెస్ సౌతాఫ్రికా 2010
92 రోహిత్ శర్మ వర్సెస్ ఆస్ట్రేలియా 2024
89 విరాట్ కోహ్లీ వర్సెస్ విండీస్ 2016
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(కెప్టెన్లు)
98 క్రిస్ గేల్ వర్సెస్ ఇండియా 2010
92 రోహిత్ శర్మ వర్సెస్ ఆస్ట్రేలియా 2024
88 క్రిస్ గేల్ వర్సెస్ ఆస్ట్రేలియా 2009