అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) హాఫ్ సెంచరీ చేశాడు. అడిలైడ్ పిచ్‌పై అతి కష్టంగా పరుగులు రాబడుతున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 59వ అర్థ శతకం కావడం విశేషం. రోహిత్ హాఫ్ సెంచరీలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మూడో వికెట్లకు శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో కేవలం 8 రన్స్‌కే నిష్క్రమించిన రోహిత్.. అడిలైడ్ పిచ్‌పై నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
ఆరంభంలో ఆసీస్ బౌలర్లు తన స్పీడ్ బంతులతో వణుకుపుట్టించినా.. రోహిత్ మాత్రం నిలకడగా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. భారీ ఇన్నింగ్స్ దిశగా రోహిత్ తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా.. 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసింది. రోహిత్ 56, శ్రేయాస్ 39 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
FIFTY!
After early jitters, Rohit Sharma gets going, brings up a fine half-century.
His 59th in ODIs 🔥
Live – https://t.co/q4oFmXx6kr #TeamIndia #AUSvIND #2ndODI | @ImRo45 pic.twitter.com/f90bJRSBSK
— BCCI (@BCCI) October 23, 2025