దుబాయ్: టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డే కెరీర్ అనిశ్చితిలో కొనసాగుతున్నప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
చాంపియన్స్ ట్రోఫీ తర్వాత హిట్‌మ్యాన్ వన్డేలు ఆడనప్పటికీ.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బాబర్ ఆజమ్ విఫలమవడం రోహిత్‌కు కలిసొచ్చింది. బాబర్ 736 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా రోహిత్ 756 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు.