ముంబై: కొద్దిరోజుల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన భారత టెస్టు మాజీ సారథి రోహిత్ శర్మ.. తన నిర్ణయం అభిమానులతో పాటు తన తండ్రి(గురునాథ్ శర్మ)నీ నిరాశకు గురిచేసిందని అన్నాడు.
పుజారా సతీమణి పూజ రాసిన ‘ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్’ బుక్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ.. “మా నాన్న ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. నా తల్లి లాగే తండ్రి కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన టెస్టులకు వీరాభిమాని. వన్డేలలో నేను రికార్డు స్కోరు (264) చేసినప్పుడు ‘ఓకే. బాగా ఆడావు’ అన్నారే తప్ప పెద్దగా ఎైగ్జెట్ కాలేదు’ అని రోహిత్ అన్నాడు.