సిడ్నీ: అందరూ ఊహించినట్లుగానే భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మకు ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో చోటు దక్కలేదు. ఆయా వార్తా సంస్థల కథనాలకు బలం చేకూరుస్తూ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ విడుదల చేసిన 15 మందితో కూడిన జట్టులో రోహిత్ పేరు లేదు. దీంతో చీఫ్ కోచ్ గౌతం గంభీర్.. రోహిత్‌పై వేటు వేశాడని, అతని కెరీర్ ఇక ముగిసినట్లేనని అభిప్రాయాలు వెల్లువెత్తాయి. దీనికి మరింత బలాన్ని జోడిస్తూ హిట్‌మ్యాన్ స్థానంలో కెప్టెన్ బుమ్రా..కమిన్స్‌తో కలిసి టాస్కు వచ్చాడు. ఆ తర్వాత వ్యాఖ్యాత రవిశాస్త్రితో బుమ్రా మాట్లాడుతూ ‘రోహిత్ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకుని నాయకత్వ స్ఫూర్తిని కనబరిచాడు. మా జట్టులో ఐకమత్యాన్ని ఇది సూచిస్తుంది.
జట్టులో ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు. జట్టుకు ఏది లాభమో అదే చేయాలని ఆలోచించాం. అందుకు తగ్గట్లుగా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది’అని బుమ్రా పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత పంత్ మాట్లాడుతూ ‘రోహిత్ జట్టులో లేకపోవడం భావోద్వేగ సందర్భం. ఇది మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం. ఈ చర్చల్లో నేను లేను కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను’ అని అన్నాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్ 14 మ్యాచ్‌ల్లో 24 సగటుతో 619 పరుగులు చేశాడు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో హిట్‌మ్యాన్ టెస్టు కెరీర్ ముగిసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్ వరకు టెస్టులు లేకపోవడం దీనికి కారణం కాగా, చాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్‌కు బదులు వన్డే కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపు ఫుల్స్టాప్ పడ్డట్లే.