Rohit Sharma | ముంబై: తనకు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంతర్జాతీయ క్రికెట్లో మరికొన్నేళ్ల పాటు కొనసాగుతానని భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్‌శర్మ అన్నాడు. ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో రోహిత్ మాట్లాడుతూ..‘నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు.
కానీ జీవితం మనల్ని ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే నేను బాగానే ఆడుతున్నా. దీనిని మరికొన్నేళ్ల పాటు కొనసాగిస్తా’ అని అన్నాడు.