బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు.. మూడవ రోజు భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన సహనాన్ని కోల్పోయాడు. బౌలర్ ఆకాశ్ దీప్‌ను తిట్టేశాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఆకాశ్ దీప్ 114 ఓవర్ వేశాడు. అయితే ఆ ఓవర్లో భారీ వైడ్ వేశాడు. ఇక కీపర్ రిషబ్ పంత్.. తన ఎడమవైపు డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. చాలా కష్టంగా అతను కీపింగ్ చేయాల్సి వచ్చింది. ఆఫ్ స్టంప్‌పై దూరం విసిరిన ఆ బంతి పట్ల.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెదడు ఉందా అన్నట్లు తిట్టుతూ సంకేతం చేశాడు. అబే సర్ మె కుచ్ హై అని రోహిత్ ఆవేశంగా అనేశాడు. ఆ తిట్టు కాస్త .. స్టంప్ మైక్‌కు చిక్కింది. ఇక కామెంటరీ బాక్సులో జోకులు పూశాయి.
Rohit Sharma & Stump-mic Gold – the story continues… 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q
— Star Sports (@StarSportsIndia) December 16, 2024
మరో వైపు ఇవాళ ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా 4 వికెట్లకు 51 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 33, రోహిత్ శర్మ ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు.