రాయ్‌పూర్: బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. స్వదేశీ పిచ్‌లపై అంతర్జాతీయ మ్యాచుల్లో 9 వేల పరుగులు స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఆ మైలురాయి అందుకున్న నాలుగవ ఇండియన్ బ్యాటర్ అయ్యాడతను. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆ మైలురాయి చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 8 బంతుల్లో 14 రన్స్ చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అయితే అన్ని ఫార్మాట్లలో కలిసి స్వదేశీ పిచ్‌పై అంతర్జాతీయ మ్యాచుల్లో 9వేల రన్స్ చేసిన క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్‌ను రోహిత్ శర్మ దాటేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో ద్రావిడ్ 9004 రన్స్ చేయగా, ఇవాళ ఆ మైలురాయిని అధిగమిస్తూ రోహిత్ శర్మ 9005 రన్స్ చేశాడు. ఆ లిస్టులో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉన్నాడు. అతను స్వదేశీ పిచ్‌లపై 14192 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 12373 రన్స్ స్కోరు చేశాడు. 7796 రన్స్ చేసిన సెహ్వాగ్ అయిదో స్థానంలో ఉన్నాడు.
మరో వైపు తాజా సమాచారం ప్రకారం రెండో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 రన్స్ చేసింది. ప్రస్తుతం గైక్వాడ్, కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు. జైస్వాల్, రోహిత్ ఔటయ్యారు.