ముంబై: రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన రోహిత్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి రోహిత్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్, ఇండియన్ కెప్టెన్ శుభమన్ గిల్‌ను ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఓవర్టేక్ చేశాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ర్యాంకింగ్స్‌లో పైచేయి సాధించాడు.
781 రేటింగ్ పాయింట్లు సాధించాడు రోహిత్ శర్మ? ఇక ఇబ్రహీం 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం 725 పాయింట్లతో బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆరో స్థానంలో ఉన్నాడు. 38 ఏళ్ల బ్యాటర్ రోహిత్ తన కెరీర్లో తొలిసారి వన్డే ర్యాంకుల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడతను. ఆ సిరీస్‌లో అతను 101 సగటుతో మొత్తం 202 రన్స్ స్కోరు చేశాడు.
వన్డే బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలవడం శుభదాయకం అవుతుంది. వన్డే భవిష్యత్తుపై అనుమానాలు కమ్ముకున్న నేపథ్యంలో .. రోహిత్ టాప్ ర్యాంకులో నిలవడం గమనార్హం. వన్డే కెప్టెన్సీని గిల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. రోహిత్ వన్డేల నుంచి రిటైర్ అవుతున్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఆసీస్ సిరీస్‌తో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడతను.
India great takes the No.1 spot for the very first time in the ICC Men’s ODI Player Rankings 🤩
Read more ⬇️https://t.co/4IgBu2txdo
— ICC (@ICC) October 29, 2025