IPL 2025 : ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వాంఖడేలో దుమ్మురేపాడు. ఫామ్ అందుకున్న అతడు అజేయంగా జట్టును గెలిపించాడు ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై అర్థ శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఫుల్షాట్లతో విరుచుకుపడిన మాజీ కెప్టెన్ … సీఎస్కేపై 9వ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా చెన్నైపై అత్యధిక 50 ప్లస్ స్కోర్ చేసిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. అతడికంటే ముందు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌లు చెన్నై మీద తొమ్మిదేసి అర్థ శతకాలు బాదారు.
ఇదే క్రమంలో రోహిత్ మరో ఘనత సాధించాడు. ఒక దేశంలో ఆడిన టీ30ల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సీఎస్కే పేసర్ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 358వ సిక్సర్ నమోదు చేశాడు. దాంతో, 357 సిక్సర్లతో ఉన్న గేల్‌ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీ మాత్రమే 325 సిక్సర్లతో రోహిత్‌కు సమీపంలో ఉన్నాడు.
The definition of a thumping 𝕎in. 🔥💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSK pic.twitter.com/2wthARtYFC
— Mumbai Indians (@mipaltan) April 20, 2025
1. రోహిత్ శర్మ(భారత్‌లో) – 360
2. క్రిస్ గేల్ – (భారత్‌లో) – 357
3. విరాట్ కోహ్లీ – (భారత్‌లో) – 325
4. ఎంఎస్ ధోనీ – (భారత్‌లో) – 286
5. కీరన్ పొలార్డ్ – (వెస్టిండీస్‌లో) – 276
వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 174 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ జూలు విదిల్చాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడిన అతడు బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ 18వ ఎడిషన్‌లో తొలి అర్థ శతకం సాధించాడు. సీఎస్కే బౌలర్లను ఉతికారేసిన హిట్‌మ్యాన్ 76 పరుగులతో నాటౌట్లో నిలిచి ముంబైకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాడు.
Rohit Sharma. Walking up the Wankhede stairs. 𝐈𝐂𝐎𝐍𝐈𝐂 𝐅𝐎𝐑𝐄𝐕𝐄𝐑. 💯#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSK pic.twitter.com/6jMXYBOAlM
— Mumbai Indians (@mipaltan) April 21, 2025