T20 World Cup 2026 : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం లభించింది. నిరుడు టీమిండియాకు పొట్టి వరల్డ్ కప్ అందించిన హిట్‌మ్యాన్‌ను ఐసీసీ అంబాసిడర్‌గా నియమించింది. మంగళవారం టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. ఈ టోర్నికి రోహిత్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ జై షా (Jai Shah) అధికారికంగా ప్రకటించారు. దాంతో.. వచ్చే ఏడాది స్వదేశంలో, శ్రీలంక వేదికగా జరుగబోయే ఈ మెగా ఈవెంట్ ప్రమోషన్స్‌లో రోహిత్ పాల్గొననున్నాడు.
‘భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు ప్రచారకర్తగా రోహిత్ శర్మ పేరును ప్రకటిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. నిరుడు టీమిండియాను విజేతగా నిలిపడంతో పాటు తొమ్మిది సీజన్లు ఆడిన రోహిత్ కంటే ఉత్తమ ప్రతినిధి మరొకరు లేరు’ అని ఐసీసీ అధ్యక్షుడు జై షా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
It’s my honour to announce that @ImRo45 is the tournament ambassador for the upcoming @T20WorldCup in India & Sri Lanka.
There can be no better representative for the event than the winning captain of the 2024 T20 World Cup, and a player who has been in all nine editions so far. pic.twitter.com/muWh3mUflj— Jay Shah (@JayShah) November 25, 2025
టీ20ల్లో విధ్వంసక బ్యాటర్ అయిన రోహిత్ 2007లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. తొలి ఎడిషన్‌లో చెలరేగి ఆడిన అతడు.. సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అజేయ హాఫ్ (50 నాటౌట్).. ఫైనల్లో పాకిస్థాన్‌పై 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిరుడు తన కెప్టెన్సీలో దేశానికి వరల్డ్ కప్ అందించి వీడ్కోలు పలికాడు హిట్‌మ్యాన్. బార్బడోస్‌లో టీమిండియాకు రెండో కప్ కట్టబెట్టిన అతడు.. భావోద్వేగంతో ఆటకు అల్విదా చెప్పాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ 140.89 స్ట్రయిక్ రేటుతో 4,231 పరుగులు సాధించాడు.
A two-time @t20worldcup champion, a record-setter across T20 World Cups and now the tournament ambassador for ICC Men’s #T20WorldCup 2026 🤩
The one and only 𝑯𝑰𝑻𝑴𝑨𝑵 Rohit Sharma 😎 pic.twitter.com/iAoBJKoAC0
— ICC (@ICC) November 25, 2025