న్యూఢిల్లీ: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ అందుబాటులో లేకపోతే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఈనెల 22 నుంచి ఆసీస్‌తో టెస్టు సిరీస్ మొదలవుతున్న నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రోహిత్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుందన్న వార్తల క్రమంలో తొలి రెండు టెస్టులకు దూరమయ్యే చాన్స్ ఉంది.