IPL 2025 : స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(55) చెలరేగుతున్నాడు. హైదరాబాద్ బౌలర్లను ఉతికేసిన హిట్‌మ్యాన్ విధ్వంసక అర్ధ శతకం సాధించాడు. కమిన్స్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన రోహిత్.. ఆ తర్వాత సింగిల్ తీసి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.
నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ డాషింగ్ ఓపెనర్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రోహిత్‌కి ఇది వరుసగా రెండో అర్ధ శతకం. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్(12) సైతం తనదైన షాట్లతో స్కోర్ బోర్డు వేగం పెంచుతున్నాడు. దాంతో, ముంబూ 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఇంకా ముంబై విజయానికి 44 రన్స్ కావాలంతే.
Leading the chase with an Impact 👌
Back-to-back half centuries for Rohit Sharma 👏#MI need 59 runs from 54 deliveries.
Updates ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @ImRo45 pic.twitter.com/4jUIARDqUA
— IndianPremierLeague (@IPL) April 23, 2025
సన్‌రైజర్స్‌ను 143 పరుగులకే కట్టడి చేసిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(11)ను జయాద్కాట్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత విల్ జాక్స్(22) అండగా రోహిత్ శర్మ(55) ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఉతికేశాడు. ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగగా ముంబై 6 ఓవర్లలోనే 56 పరుగులు చేసింది. ముంబైని గెలుపు దిశగా నడిపిస్తున్న ఈ జోడీని జీషన్ విడదీశాడు. ధాటిగా ఆడుతున్న జాక్స్‌ను పెవిలియన్ పంపాడు. దాంతో, 77 వద్ద రెండో వికెట్ పడింది.