న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగిన టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న తాజాగా మంగళవారం ఓ ఆడియోను బయటపెట్టాడు. అది ఐఏటీఏ గౌరవ సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్‌తో తాను మాట్లాడిన ఫోన్ కాల్‌కు సంబంధించిన ఆడియో. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ తన నామినేషన్‌ను ఆమోదించిందంటూ ఏఐటీఏ అబద్ధాలు చెప్పిందని ఆరోపించిన బోపన్న.. ఇప్పుడు ఈ ఆడియోతో దానిని నిరూపించే ప్రయత్నం చేశాడు.
బోపన్న మంగళవారం చేసిన ట్వీట్లో ఇలా ఉంది. గుడ్ మార్నింగ్.. ఐటీఎఫ్ ఎంట్రీని ఆమోదించిందంటూ ఏఐటీఏ సెక్రటరీ జనరల్ దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు ఆపండి. ఇక మారాల్సిన టైమ్ వచ్చింది. ఇప్పటికే 50 ఏళ్లుగా ఫెడరేషన్ చేతగానితనం వల్ల ప్లేయర్స్ బాధితులయ్యారు అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనికి తాను సెక్రటరీ జనరల్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియోను యాడ్ చేశాడు.
రేపే గుడ్‌న్యూస్ వస్తుంది. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు, దివిజ్ కలిసి ఆడటం సాధ్యం కాదు. నీది, సుమిత్ ఎంట్రీ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది అని అనిల్ ధూపర్ ఆ ఆడియో చెప్పడం వినిపించింది. ఐటీఎఫ్ దీనిని ఆమోదించిందా అని బోపన్న అడగ్గా.. అవును వాళ్లు ఆమోదించారు అని అనిల్ ధూపర్ చెప్పారు. అయితే బోపన్న తర్వాత ఈ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఇప్పటికే సానియా మీర్జా, మహేష్భూపతిలాంటి స్టార్ ప్లేయర్స్ బోపన్నకు అండగా ట్వీట్లు చేశారు.
50years and this is still going on. I really really hope for the betterment of Indian tennis there is a change.
— Rohan Bopanna (@rohanbopanna) July 20, 2021
Our future tennis players deserve better administration . #bringthechange https://t.co/2UnDJr5rCs