French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో రోహన్ బోపన్న(Rohan Bopanna) జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్(Mathew Ebden) జంట ఒత్తిడికి లోనవ్వకుండా విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎన్ శ్రీరామ్ బాలాజీ, మిగెల్ ఆంజెల్ రెయెస్ వరెలా ద్వయాన్ని మట్టికరిపించింది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బోపన్న జంట తొలి సెట్ కోల్పోయింది. 29 అనవసర తప్పదాలు చేసింది. అయితే.. కీలకమైన రెండు, మూడు సెట్లలో గట్టి పోటీ ఎదురైనా బోపన్న, ఎబ్డెన్‌లు చాంపియన్ ఆటతో అదరగొట్టారు. రెండు గంటల 20 నిమిషాల పాటు ‘నువ్వా నేనా’ అన్నట్టు సాగిన మ్యాచ్‌లో 6-7, 6-3, 7-6తో విజయం సాధించి క్వార్టర్స్‌లో పాగా వేశారు.
News Flash: Rohan Bopanna & Matthew Ebden advance into QF of French Open.
2nd seeded Indian pair had to fight really hard for 6-7, 6-3, 7-6 win over Sriram Balaji & Miguel Angel. #rolandgarros pic.twitter.com/mngPAHzbxJ
— India_AllSports (@India_AllSports) June 3, 2024