BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా రోజర్ బిన్ని (Roger Binny) వైదొలిగాడు. వయసు పరిమితి కారణంగా ఈ వరల్డ్ కప్ హీరో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. దాంతో, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా (Rajeev Shukla) మధ్యంతర నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. కొత్త ప్రెసిడెంట్ కోసం ఎన్నికలు జరిగేంత వరకూ శుక్లా బీసీసీఐ బాస్‌గా కొనసాగనున్నాడు. అంతేకాదు ఐపీఎల్ ఛైర్మన్‌గానూ శుక్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
సౌరవ్ గంగూలీ తర్వాత 2022 అక్టోబర్‌లో బీసీసీఐ బాస్‌గా పగ్గాలు చేపట్టాడు రోజర్ బిన్ని. తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడైన బిన్ని జూలైలో 70వ వసంతంలో అడుగుపెట్టాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్షులకు, సెక్రటరీ, కోశాధికారి.. అందరికీ వయోపరిమితి 70 ఏళ్లు. దాంతో, బిన్ని తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
#RogerBinny steps down as #BCCI President, #RajeevShukla to hold the position till next round of elections.
Read: https://t.co/QOhrzSNnU4 pic.twitter.com/3iLoA4jvGE
— NDTV Profit (@NDTVProfitIndia) August 29, 2025
కొత్త ప్రెసిడింట్ ఎంపిక కోసం వచ్చే నెలలో (సెప్టెంబర్) ఎలక్షన్స్ జరుగుతాయి. అప్పటివరకూ రాజీవ్ శుక్లా మధ్యంతర నాయకుడిగా కొనసాగుతాడు. 2020 డిసెంబర్ 18న శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల విషయానికొస్తే.. 30 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకొని బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరిని మూడేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. బీసీసీఐ వార్షిక సమావేశంలో కొత్త ప్రెసిడెంట్ పేరును ప్రకటిస్తారు.