ఢిల్లీ : ఐపీఎల్లో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) పలికి రికార్డు సృష్టించిన వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ తన పాత ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. తన వేతనంలో రూ. 12 కోట్ల భారీకోతకు అంగీకరించి మరీ రూ. 15 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. స్వాప్ డీల్‌లో భాగంగా పంత్‌ను ఢిల్లీకి అప్పగించిన లక్నో సూపర్ జెయింట్స్.. అతడికి బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (రూ. 13.50 కోట్లకు)ను తీసుకుంది.
2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో రికార్డు ధరకు లక్నోకు వెళ్లిన పంత్.. రెండు సీజన్లలోనూ సారథిగానే గాక బ్యాటర్‌గానూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఢిల్లీ అతడిని లక్నోకు వదులుకుంది. తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలించుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవడానికి కోల్‌కతా, రాజస్థాన్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.