Rishabh Pant : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్. కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పనున్నాడు. పంత్ త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు మారుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మెగా వేలానికి ముందే ఈ డాషింగ్ బ్యాటర్ పసుపు రంగు జెర్సీ వేసుకొనే చాన్స్ ఉంది.
ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting)పై వేటు వేసిన ఢిల్లీ యాజమాన్యం పంత్ కెప్టెన్సీ పట్ల కూడా అసంతృప్తిగా ఉందని టాక్. దాంతో, వచ్చే సీజన్ కోసం అతడిని అట్టిపెట్టుకోవాలా? వద్దా? అని జిదాల్ టీమ్ తలలు పట్టుకుంటోందట. ఈ నేపథ్యంలో పంత్ సీఎస్కేకు ఆడడంపై ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.
Give us some 𝗛𝗶𝗻𝘁𝘀 in the comments👇🏻👀 pic.twitter.com/YZjhvAXTTf
— Delhi Capitals (@DelhiCapitals) July 20, 2024
పంత్ సీఎస్కేకు ఆడాలనకోవడం వెనక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హస్తం ఉండొచ్చు. ఎందుకంటే..? పదిహేడో సీజన్లో కెప్టెన్సీ వదిలేసిన మహీ భాయ్ మరో సీజన్ ఆడడం సందేహమే. దాంతో, వికెట్ల వెనకాల ధోనీలా చురుకుగా ఉండే, బ్యాటుతోనే విధ్యంసం సృష్టించే పంత్ సీఎస్కే కూర్పులో చక్కగా సరిపోతాడు. అందుకని చెన్నై సైతం వేలంలో లేదంటే ట్రేడింగ్ పద్ధతిలో పంత్‌ను కొనేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది.

రెండేండ్ల క్రితకం కారు యాక్సిడెంట్లో పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మోకాలి సర్జరీ, ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో కఠోర వ్యాయామాల తర్వాత ఈ యంగ్‌స్టర్ ఫిట్నెస్ సాధించాడు. దాదాపు ఏడాది విరామం అనంతరం పంత్ 17వ సీజన్‌తో ఐపీఎల్లో పునరాగమనం చేశాడు. ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ నుంచి పగ్గాలు అందుకొని మళ్లీ సారథిగా ఢిల్లీని నడిపించాడు. అయితే.. ఆటగాడిగా మునుపటి ఫామ్ అందుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ జట్టను ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయాడు. దాంతో, ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ వేటకు సిద్ధమైంది.