IPL 2024 : ప్రపంచలోని పొట్టి క్రికెట్ లీగ్స్‌లో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మరో సీజన్ వేలానికి మరో 11 రోజులే ఉంది. 17వ సీజన్ మినీ వేలంలో గెలుపు గుర్రాలను కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు రీలే రస్సో(Rilee Rossouw) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మినీ వేలంలో తనకోసం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడితే భలేగా ఉంటుందని రస్సో అన్నాడు. గత సీజన్లో ఢిల్లీకి ఆడాను. అమెరికన్ లీగ్‌లో నైట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అందుకని 17వ సీజన్ మినీ వేలంలో ఈ రెండు ఫ్రాంచైజీలు నన్ను కొనుగోలు చేసేందుకు పోటీ పడితే చూడాలని ఉంది అని ఈ యంగ్‌స్టర్ తెలిపాడు.
రీలే రస్సో

16వ సీజన్ మినీ వేలంలో రస్సోను ఢిల్లీ క్యాపిటల్స్ రెట్టింపు ధరకు కొన్నది. రూ.2 కోట్ల కనీస ధర ఉన్నఅతడిని రూ.4,68 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే.. ఈ లెఫ్ట్‌హ్యాండర్ పేలవ ఫామ్‌తో మేనేజ్మెంట్, ఢిల్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. రస్సో 9 మ్యాచుల్లో 148 స్ట్రైక్ రేటుతో 209 రన్స్ కొట్టాడంతే. దాంతో, 17వ సీజన్ వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదులుకుంది. దాంతో, రస్సో.. ఈసారి మినీవేలంలో రూ. 2 కోట్ల కనీస ధరకు తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు.