IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చెలరేగిపోతున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఓపెనర్ రియాన్ రికెల్టన్(57) మళ్లీ దంచేస్తున్నాడు. వాంఖడేలో మెరుపు బ్యాటింగ్ చేసిన అతడు సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బౌలర్లను ఉతికేస్తూ అర్థ అతకంతో ముంబైని ఆదుకున్నాడు. రోహిత్ శర్మ(12) వెనుదిరిగాక.. రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బౌండరీలతో హోరెత్తించాడు. మరోవైపు విల్ జాక్స్(14) సైతం ధాటిగా ఆడతున్నాడు. దాంతో ముంబై 8 ఓవర్లలో వికెట్ నష్టానికి పరుగులు చేసింది.
టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. సొంతమైదానంలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్(57), రోహిత్ శర్మ(12)లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రిన్స్ యాదవ్ వేసిన 2వ ఓవర్లో రెచ్చిపోయిన రికెల్టన్ 6, 4, 4 బాది తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాతి ఓవర్లో రోహిత్ సైతం మయాంక్ యాదవ్కు చుక్కలు చూపిస్తూ రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే.. పెద్ద షాట్ ఆడబోయి ఆఖరి బంతికి ప్రిన్స్ చేతికి చిక్కాడు. దాంతో, 33 వద్ద ముంబై తొలి వికెట్ పడింది.
Finding boundaries at ease 🤌
Ryan Rickelton is in full flow with his FIFTY No. 2️⃣ in #TATAIPL 2025 💪
Updates ▶ https://t.co/R9Pol9IKVU #MIvLSG | @mipaltan pic.twitter.com/iEcPaei9If
— IndianPremierLeague (@IPL) April 27, 2025