Richa Ghosh : స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా రెండు విజయాలు నమోదు చైసింది. ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. పాక్‌పై, సఫారీలపై టాపార్డర్ చితక్కొట్టలేదు. మిడిలార్డర్ బ్యాటర్లు దంచేయలేదు. అయినా సరే హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పోరాడగలిగే స్కోర్లతో సాధిచండానికి కారణం రీచా ఘోష్ (Richa Ghosh). కొంతకాలంగా భారత జట్టు విజయాల్లో కీలకమవుతున్న రీచా ప్రపంచకప్‌లో విధ్వంసక ఆటతో విరుచుకుపడుతోంది.
విశాఖపట్టణంలో దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ టీమిండియాకు భారీ స్కోర్ అందించిన రీచా.. వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించింది. అత్యంత వేగంగా వెయ్యి పరుగుల క్లబ్లో చేరిన భారత మొదటి మహిళ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఎనిమిదో స్థానంలో ఆడుతూ.. 94 రన్స్‌తో మరో రికార్డు తన పేరిట రాసుకుందీ యంగ్‌స్టర్. దూకుడే మంత్రగా భారత జట్టు హ్యాట్రిక్ విజయాల్లో కీలమైన రీచా గురించి ఆసక్తికర విషయాలివి.
Milestone 🔓
1⃣0⃣0⃣0⃣ ODI runs & going strong! 💪
Well done, Richa Ghosh! 👏 👏
Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/iceHv12N8J
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
బౌలర్ల పాలిట విలన్‌గా మారిన రీచా ఘోష్ క్రికెటర్ అవ్వాలనుకోవడానికి కారణం ఆమె తండ్రి మనబేంద్ర. ఆయన ఒక క్రికెటర్ ఆ తర్వాత అంపైర్‌గానూ సేవలందించారు. తండ్రి క్లబ్ మ్యాచ్‌లు ఆడడం చూసినన రీచా నాలుగేళ్ల వయసులోనే ఆటపై ఇష్టం పెంచుకుంది. పెద్దయ్యాక నాన్నలా క్రికెటర్ అవ్వాలనుకుంది. కూతురి ఆసక్తిని గమనించి తొలి గురువుగా మారారు మనబేంద్ర. సిలిగురిలోని భగత్ అనే క్రికెట్ క్లబ్లో రీచాను చేర్పించిన ఆయన.. అక్కడ అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడించేవారు.
Richa’s father Manabendra Ghosh went to the Siliguri district magistrate Sumanta Sahay’s residence to hand over the cheque on Saturday, Cricket Association of Bengal said.@CabCricket #Covid19India pic.twitter.com/ct1oLozg0l
— Female Cricket (@imfemalecricket) March 29, 2020
Richa’s father Manabendra Ghosh went to the Siliguri district magistrate Sumanta Sahay’s residence to hand over the cheque on Saturday, Cricket Association of Bengal said.@CabCricket #Covid19India pic.twitter.com/ct1oLozg0l
— Female Cricket (@imfemalecricket) March 29, 2020
ఫాస్ట్ బౌలర్లకు ఏమాత్రం అదరకుండా.. వాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడం అలవర్చుకున్న రీచా.. హిట్టింగ్ మీద దృష్టి సారించింది. తన దూకుడైన ఆటకు తోడూ వికెట్ కీపింగ్‌లో రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అలా.. పద్నాలుగేళ్లకు బెంగాల్ సీనియర్ టీమ్‌లోకి వచ్చింది. 2017లో దేశవాళీలో అరంగేట్రం చేసిన రీచా ఆ తర్వాతి రెండేళ్లకే అంతర్జాతీయ టీ20ల్లోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లోనూ చోటు దక్కించుకుందీ రన్ మెషీన్. కరోనా సమయంలో రూ.1లక్ష విరాళంగా ప్రకటించి తన సేవాగుణాన్ని చాటుకుందీ యువబ్యాటర్.
దూకుడుకు కేరాఫ్ అయిన రీచా వరల్డ్ కప్‌లో భారత జట్టుకు తరగని ఆస్తిలా మారింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్రధాన బ్యాటర్లు విఫలైమనవేళ.. క్రీజులోకి వచ్చిన రీచా తనదైన విధ్వంసాన్ని కొనసాగించింది. దాయాది బౌలర్లకు దడపుట్టిస్తూ అజేయంగా 35 రన్స్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసింది. రీచా ఇన్నింగ్స్‌తో పాక్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది టీమిండియా.
𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗥𝗶𝗰𝗵𝗮 𝗚𝗵𝗼𝘀𝗵 – 𝗪𝗵𝗮𝘁 𝗔 𝗞𝗻𝗼𝗰𝗸! 🙌 🙌
9⃣4⃣ Runs
7⃣7⃣ Balls
1⃣1⃣ Fours
4⃣ SixesDrop your reaction in the comments below 🔽 on that stunning innings! 🔥
Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/xLdVOEX8In
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై రీచా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. సఫారీ స్పిన్నర్ల ధాటికి జట్టు స్కోర్ 200 దాటడమే గగనం అనుకున్నవేళ ఆమె పెద్ద షాట్లతో విరుచుకుపడుతూ.. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. ఎనిమిదో స్థానంలో వచ్చి స్నేహ్ రానాతో 88 రన్స్ జోడించి స్కోర్ 250 దాటించింది.
దేశం తరఫున ఇరగదీస్తున్న రీచా డబ్ల్యూపీఎల్‌లోనూ తన తడాఖా చూపించింది. రెండు సీజన్లలో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి విజేతగా అవతరించడంలో ఆమె పాత్ర చాలానే ఉంది. వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణించిన ఈ యువకెరటం 257 రన్స్‌తో మెరిసింది. ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక స్కోర్ ఆమెదే. ఆటలోనే కాదు చదువులోనూ రాణిస్తోంది రీచా. నిరుడు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకొని ఇంటర్ పరీక్షలు రాసింది.
Power in Plenty! 💪
Richa Ghosh is on the move! 👏#RCB need more such hits with 1️⃣2️⃣3️⃣ runs needed to win from 1️⃣0️⃣ overs
Updates ▶️ htps://tinyurl.com/5d6be3j6 #TATAWPL | #UPWvRCB | @RCBTweets pic.twitter.com/fMe9axVNaP
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2025