Rishabh Pant : టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ రిషభ్ పంత్ (Rishabh Pant) దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే మరోసారి గాయపడ్డాడు. పాదం గాయం నుంచి కోలుకుని భారత ఏ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన పంత్.. రెండో అనధికారిక టెస్టు (Unofficial Test)రెండో ఇన్నింగ్స్‌లో రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏ పేసర్లను ఎదుర్కొనే క్రమంలో పలుమార్లు బంతి తగిలించుకున్నాడీ హిట్టర్. సఫారీ పేసర్ సెపో మొరెకీ ఓవర్లో మూడుసార్లు పంత్ శరీరం, హెల్మెట్‌కు బంతి బలంగా తగిలడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది.
మొదటి అనధికారికి టెస్టులో మెరుపు అర్ధ శతకంతో ఫామ్ చాటుకున్న పంత్.. రెండో మ్యాచ్‌లోనూ దంచేయాలనుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్(27) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ తనదైన స్టయిల్లో దూకుడుగా ఆడాడు. తొలి మూడు బంతులను 4, 4 ,6 గా మలిచిన పంత్‌ను కట్టడి చేసేందుకు సఫారీ పేసర్లు షార్ట్ పిచ్ బంతులు సంధించారు. దాంతో.. పంత్ కాస్త నెమ్మదించాడు.
Another injury scare for Rishabh Pant, as he was forced to retire hurt on 17 after copping multiple blows during India A’s second innings of the ongoing 2nd Unofficial Test against South Africa A.
📸: PTI#INDAvSAA #RishabhPant #IndiaA pic.twitter.com/IA5qsMWJHk
— Circle of Cricket (@circleofcricket) November 8, 2025
అయితే.. సెపో మొరెకీ వేసిన 34వ ఓవర్లో బంతి మూడు సార్లు శరీరం, హెల్మెట్‌కు తగలడంతో నొప్పిని భరిస్తూనే పంత్ ఆట కొనసాగించాడు. కానీ, అతడు మరోసారి తీవ్రంగా గాయపడకుండా చూడాలనే ఉద్దేశంతో కోచ్ హ్రిశికేశ్ కనికర్, ఫిజియోలు వెనక్కి పిలిచారు. దాంతో.. రిటైర్డ్ హర్ట్‌గా పంత్ మైదానం వీడాడు. అప్పటికి ఈ డాషింగ్ బ్యాటర్ 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు. సెంచరీ వీరుడు ధ్రువ్ జురెల్ (127 నాటౌట్)తో కలిసి ఆధిక్యాన్ని నాలుగొందలు దాటించాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించిన అతడు.. సిమండ్స్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయాడు. కానీ, టైమింగ్ కుదరక వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే భారత ఏ జట్టు 382-7 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
🚨2 100s for Dhruv Jurel in single game vs RSA A.
I dont understand why Gambhir doesn’t let both Jurel & Pant play in same XI in test.
Sudarshan failed in both Ind A games vs RSA, he failed in Eng tour also & Jurel who is a proven match winner sits out!pic.twitter.com/yfil2vSBsK
— Rajiv (@Rajiv1841) November 8, 2025
జురెల్ అజేయ శతకం.. పంత్ మెరుపు అర్ధ శతకంతో ప్రత్యర్ధి ముందు 417 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 119 కేఆ ఆరు వికెట్లు పడిన వేళ వీరోచిత శతకం(132 నాటౌట్)తో జట్టును ఆదుకున్న జురెల్ … రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగి భారీ ఆధిక్యాన్ని అందించాడు.