Mohammad Rizwan | పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బాబర్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం ఇదిరెండోసారి. ప్రస్తుతం తాను ఆటపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పాడు. తాజాగా పీసీబీ కొత్త కెప్టెన్సీ వేటలో పడింది. వన్డే, టీం కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్ న్యూస్ ఛానెల్ జియో న్యూస్ ఓ కథనంలో పేర్కొంది. రిజ్వాన్ ఇప్పటి వరకు పాక్ తరఫున 74 వన్డేలు, 102 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 2,088.. టీ20 మ్యాచుల్లో 3,313 పరుగులు చేశాడు. అయితే, బాబర్‌ను పీసీబీ రాజీనామా చేయాలని కోరలేదని నివేదిక తెలిపింది. వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాలని కోరినా.. తప్పుకునేందుకు ఆసక్తి చూపించినట్లుగా చెప్పింది.
కోచ్ గ్యారీ కిర్‌స్టన్ జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాలని అనుకుంటుండగా.. వెటరన్ ప్లేయర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. గత అక్టోబర్, నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్ చెత్త ప్రదర్శన చేసింది. ఆ తర్వాత బాబర్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత టీ20 బాధ్యతలను షహీన్ ఆఫ్రిదికి అప్పగించారు. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం పీసీబీ మరోసారి బాబర్‌కే బాధ్యతలు కట్టబెట్టింది. గతేడాది నవంబర్‌లో ప్రపంచకప్ అనంతరం పాక్ ఇప్పటి వరకు వన్డేలు ఆడలేదు. అలాగే, అమెరికా, వెస్టిండిస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 సిరీస్‌లు సైతం ఆడలేదు.