INDW VS NZW : భారీ ఛేదనలో న్యూజిలాండ్ రెండో వికెట్ పడింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన ఓపెనర్ జార్జియా పిమ్మర్(30)ను రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. లెంగ్త్ బంతిని సంధించగా.. ప్లిమ్మర్ షాట్‌కు యత్నించింది. కానీ, బ్యాట్ కొసకు తగిలిన బంతి లోపలికి వెళ్తూ వికెట్లను గిరాటేసింది. దాంతో.. డేంజరస్ ఓపెనర్ నిరాశగా పెవిలియన్ చేరింది. హాఫ్ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. సోఫీ డెవినె (4 నాటౌట్) బౌండరీతో ఖాతా తెరిచింది. 10 ఓవర్లకు స్కోర్. 55-2. అమేలియా కేర్ 18 పరుగులతో క్రీజులో ఉంది.
బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన తొలి ఓవర్లోనే వికెట్ అందించింది. పెద్ద షాట్ ఆడే తొందరలో కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్(1) బంతిని గాల్లోకి లేపింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక రావల్ ఒడుపుగా క్యాచ్ అందుకోగా.. ఒక్క పరుగు వద్దే వైట్ ఫెర్న్స్ తొలి వికెట్ కోల్పోయింది.
Wicket No. 2️⃣ for #TeamIndia \|/
Renuka Singh Thakur opens her account and Georgia Plimmer walks back 👏
Updates ▶ https://t.co/AuCzj0Wtc3#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/9IcrawHiJh
— BCCI Women (@BCCIWomen) October 23, 2025
అనంతరం అమేలియా కేర్ (18 నాటౌట్).. జార్జియా పిమ్మర్(30)లు ఆచితూచి ఆడారు. రేణుకా సింగ్ వేసిన 8వ ఓవర్లో ప్లిమ్మర్ రెండు, కేర్ ఒక ఫోర్ బాదారు. ఆ తర్వాత స్నేహ్ రానా ఓవర్లో సిక్సర్ కొట్టిన ప్లిమ్మర్ చివరకు రేణుక ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయింది.