నెదర్లాండ్స్: రేసింగ్ ట్రాక్‌పై తిరుగులేకుండా దూసుకెళ్తున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మరో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం వర్షం మధ్య సాగిన డచ్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ 2 గంటలా 24 నిమిషాలా 4 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ప్రపంచ డ్రైవర్ చాంపియన్సిప్లో 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. అలోన్సో (ఆస్టోన్ మార్టీన్), గాస్లీ (అల్పైన్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.