ఢాకా : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్ల బృందాలు ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు.. (అతాను దాస్, రాహుల్, యశ్దీప్ త్రయం) సెమీస్‌లో 5-3తో కజకిస్థాన్‌ను ఓడించింది.
దీప్షిక, ప్రీతిక, జ్యోతి సురేఖతో కూడిన కాంపౌండ్ మహిళ జట్టు సెమీస్‌లో 234-227తో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. వ్యక్తిగత విభాగాల్లో వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి, బొమ్మదేవర ధీరజ్ సెమీస్ చేరారు.