గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ ఆరంభంలోనే రెండు పతకాలు సాధించి భారీ అంచనాలు పెంచిన భారత ఆర్చర్లు తర్వాత తేలిపోతున్నారు. బుధవారం భారత్‌కు మరోసారి నిరాశజనక ఫలితాలే వచ్చాయి. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పోరుకు అర్హత సాధించిన భారత్.. 3-5తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది.
దీపికా కుమారి, గత ఖడకె, అంకితాతో కూడిన భారత త్రయం.. ఒక దశలో 3-3తో సమంగా ఉన్నప్పటికీ ఆఖర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్లో దీపికా, నీరజ్ ద్వయం.. ప్రిక్వార్టర్స్‌లో 4-5తో జపాన్ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల వ్యక్తిగత విభాగాల్లో రాహుల్, ధీరజ్, నీరజ్కూ నిరాశ తప్పలేదు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా కాంపౌండ్ విభాగం పురుషుల టీమ్ ఈవెంట్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రమే భారత్ పతకాలు సాధించింది.