BGT Series | మెల్బోర్న్: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. అది ఆస్ట్రేలియాతో అయితే మరీను. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 6వేల మందికి పైగా ఫ్యాన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘గత సిరీస్‌తో పోల్చుకుంటే ఈసారి రికార్డు స్థాయిలో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చారు. దాదాపు 6వేల మందికి పైగా ఆస్ట్రేలియాకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. సిరీస్ మొత్తంగా 8,37,879 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌లు వీక్షించారు’ అని తెలిపింది.