WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు పెద్ద షాక్ తగిలింది. నాలుగో సీజన్ కోసం భారీ ధరకు అట్టిపెట్టుకున్న మ్యాచ్ విన్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలీసా పెర్రీ (Ellyse Perry) ‘అందుబాటులో ఉండను’ అని చెప్పేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అనాబెల్ సథర్లాండ్ (Annabel Sutherland) సైతం ‘నాలుగో సీజన్ ఆడడం లేదు’ అని ఫ్రాంచైజీకి తెలిపింది. దాంతో.. మ్యాచ్ విజేతలైన వీరిద్దరి సేవల్ని ఆర్సీబీ, ఢిల్లీ కోల్పోనున్నాయి.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ సన్నాహకాల్లో మునిగిపోయిన ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాకిచ్చారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న టోర్నీకి ముందే మేము వైదొలుగుతున్నాం అని చెప్పేశారు. నిరుడు బెంగళూరు ట్రోఫీ గెలుపొందడంలో కీలకమైన విధ్వంసక ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది.
🚨 NO ELLYSE PERRY IN THE WPL 2026 🚨
– Ellyse Perry and Annabel Sutherland have withdrawn from the WPL 2026 due to personal reasons 😲
– Ellyse Perry was retained by RCB and Sutherland was retained by Delhi Capitals
– What’s your take 🤔 pic.twitter.com/ye7kKjbm4D
— Richard Kettleborough (@RichKettle07) December 30, 2025
ఢిల్లీ ప్రధాన పేసర్ అనాబెల్ సథర్లాండ్ సైతం వ్యక్తిగత కారణాలతోనే టోర్నీకి అందుబాటులో ఉండనని తెలిపింది. దాంతో.. పెర్రీ స్థానంలో సయాలీ సత్గరేను తీసుకుంది ఆర్సీబీ. రూ.30 లక్షల కనీస ధరకు సయాలీ బెంగళూరు స్క్వాడ్‌లో చేరనుంది. సథర్లాండ్ స్థానాన్ని ఆస్ట్రేలియాకే చెందిన స్పిన్నర్ అలనా కింగ్ భర్తీ చేయనుంది. ఇటీవలే వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్లతో మెరిసిన ఈ యువకెరటంతో రూ.60 లక్షలకు ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకుంది.
Australian all-rounders Ellyse Perry and Annabel Sutherland have opted out of the WPL 2026 due to personal reasons
Sayali Satghare has been named as the replacement of Ellyse Perry in the RCB squad, while Annabel Sutherland has been replaced in the DC squad by her Australian… pic.twitter.com/kc0lMhHppg
— InsideSport (@InsideSportIND) December 30, 2025
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో అలీసా పెర్రీ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీని గెలిపించింది. 9 మ్యాచుల్లో 347 పరుగులు చేసిందీ ఆల్‌రౌండర్. దాంతో, నాలుగో సీజన్ కోసం పెర్రీని రూ.2 కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. ప్రధాన పేసరైన సథర్‌లాండ్‌ను ఢిల్లీ రూ.2.2 కోట్లకు రీటైన్ చేసుకుంది. కానీ, వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో డబ్ల్యూపీఎల్ 2026 నుంచి వైదొలిగారు. యూపీ వారియర్స్ సైతం స్క్వాడ్‌లో ఒక మార్పు చేసింది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌కు ఎంపికైన తారా నోరిస్ (Tara Norris) స్థానంలో చార్లీ నాట్(ఆస్ట్రేలియా)ను రూ.10 లక్షలకు తీసుకుంది.