నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నంలో సన్‌రైజర్స్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (21) పెవిలియన్ చేరాడు. హసరంగ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
దీంతో మార్క్రమ్ నిరాశగా మైదానం వీడగా.. బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు సన్‌రైజర్స్ ఓపెనర్లు ఇద్దరూ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.