సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం అదరగొడుతోంది. బౌలర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటింగ్ కకావికలమైంది. ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్ (5), అనూజ్ రావత్ (0), కోహ్లీ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ మూడు వికట్లను ఒకే ఓవర్లో జాన్సెన్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాసేపు నిలబడిన మ్యాక్స్వెల్ (12)ను నటరాజన్ అవుట్ చేశాడు.
మళ్లీ 9వ ఓవర్లో బంతి అందుకున్న సుచిత్ కూడా సత్తా చాటాడు. రెండో బంతికే సూయష్ ప్రభుదేశాయి (15)ని పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్ (0)ను కూడా సుచిత్ అవుట్ చేశాడు. సుచిత్ వేసిన బంతిని డీకే ఆడలేకపోయాడు. బంతి కీపర్ చేతుల్లో పడింది. కీపర్ పూరన్, సుచిత్ ఇద్దరూ అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు. దీంతో ఇద్దరూ కలిసి కెప్టెన్ను ఒప్పించి రివ్యూ తీసుకున్నారు. బంతి డీకే గ్లవ్ను తాకినట్లు రీప్లేలో తేలడంతో అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.